అమలాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 18:
నేర పరిశోధనా రంగంలో కేసుల సత్వర పరిష్కారానికి ఆధునాతన విధానాలను పాటించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులను ఏబీసీడీ అవార్డులు వరించాయి. మంగళగిరి కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం పోలీసులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కేసును ఛేదించినందుకు ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ ప్రసాద్, రూరల్ సీఐ వీరబాబు, సీసీఎస్ ఎస్ఐ ప్రశాంత్, రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు అవార్డులు అందుకున్నారు.