వలంటీర్లను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం

12/19/2024 5:34:42 AM

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు 18: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ వలంటీర్లకు 10 వేల రూపాయలు జీతాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీలు నెరవేర్చకుండా  కాలయాపన చేసి గాలికి వదిలేసిందని వలంటీర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు దేవా, జిల్లా కార్యదర్శి చిన్నయ్య ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ విజయవాడలో 50 గంటల దీక్షలో విజయవాడ  వార్డు సచివాలయం మహిళా వలంటీర్స్ మమతా,షసరోజిని దీక్ష శిబిరంలో స్పృహ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ వలంటీర్లకు ఇచ్చిన హామీలను మొండి వైఖరి చేస్తుందని, తక్షణమే వారిని విధుల్లో తీసుకోవాలని, లేని ఎడల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వలంటీర్లు రాస్తారోకి దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రామ వార్డు వలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల వలంటీర్స్ అసోసియేషన్ మెంబర్స్, భానుముర్తి, కిరణ్, అర్జున్, సుబ్బారావు, నర్సింహామూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*