ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు 18: మండలంలో దారెల పంచాయతీ దారెల గ్రామానికి చెందిన చెండ సుబ్రహ్మణ్యం (35) ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సుబ్రహ్మణ్యంతో కలిసి పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు, డొనేషన్ చేసుకుని అందుబాటులో ఉన్న తోటి మిత్రులు ఎస్ శంకర్రావు, సిహెచ్ రుక్మందర్, పి. ఆనందరావు, గ్రామ పెద్దల చేతుల మీదుగా బుధవారం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులు అమ్మ మచ్చులమ్మ, అన్నయ్య రమేష్ లతో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం మరణం చాలా బాధాకరమైన విషయం ఎంతో స్నేహ భావంతో అందరితో మెలిగేవాడని, ఎవరితో దురుసుగా ప్రవర్తించే వాడు కాడని విచారం వ్యక్తం చేశారు. 2000-05 సంవత్సరంలో పెదబయలు ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో సుబ్రహ్మణ్యం తో కలిసి విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎవరికి తోచినంత వారు డొనేషన్ చేసుకొని 6516/- రూపాయలు అందించమన్నారు. తరగతి మిత్రులకు, పులిరాజు, నాగరాజు, ఆనంద్,శంకర్ రుక్మాన్, సుమన్, లక్షన్, వైకుంఠరావు, గోపినాదం, తిరుపతి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎస్. ఆనందరావు, పి. సుమన్, సిహెచ్ గోపాలం, పి. సూరిబాబు, సిహెచ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.