ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు,19: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు గురువారం తెలిపారు. వైసిపి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, అభిమానులు, మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు.