మర్రివాడ గ్రామంలో రెవెన్యూ సదస్సు

12/19/2024 11:52:27 PM

కొయ్యూరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,డిసెంబర్ 19:
మండలంలోని మర్రివాడ గ్రామ సచివాలయంలో  గురువారం కొయ్యూరు తహసిల్దార్ ఎస్ ఎల్ వి.ప్రసాద్ ఆధ్వర్యంలో  రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన 114  వినతి పత్రాలను అధికారులు స్వీకరించారు. వాటిలో మ్యూటేషన్ లు 83, ఎఫ్ లైన్ 6 , ఆర్ ఓ ఎఫ్ ఆర్19, ల్యాండ్ డిస్ప్యూట్ 4 తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి గాను సాద్యాసాధ్యాలను అన్వేషించినున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ వినతులను 45 రోజులలో పరిష్కారమయేటట్టు చర్యలు తీసుకుంటామ న్నాలు. కార్యక్రమంలో  ఎక్స ఎం పి పి గొలిసింగి సత్యన్నారాయణ, డిప్యూటీ తాసిల్దార్ కుమారస్వామి, రీ సర్వేర్  డిటిపి అప్పన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న దొర, మండల సర్వేయర్ వీఆర్వో వి ఎస్ రెవెన్యూ టీం సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు...

Name*
Email*
Comment*