దేవరాపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 19: స్థానిక రైవాడ జలాశయం అతిథిగృహం వద్ద గురువారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైవాడ జలాశయం ఛైర్మన్ గా పోతల పాత్రుడు నాయుడును ఎంపిక చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, క్రమ శిక్షణతో మెలుగుతూ రైతులకు ఎంతో న్యాయం చేయాలనన్నారు. వైస్ ఛైర్మన్ బొడ్డు ఉమాదేవి చేస్తుందన్నారు. ఈ మేరకు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సమక్షంలో డైరెక్టర్లు ఏకాభిప్రాయంతో వీరిని ఎంపిక చేశారు. పాత్రుడు నాయుడు నియామకంతో రైవాడ జలాశయం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా కొత్త ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఈనెల 21న ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు చిట్టిమిరెడ్డి సూర్యనారాయణ, మండల కార్యదర్శి శరకాల సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు చల్లా నానాజీ, మాజీ మండల అధ్యక్షులు కిలపర్తి భాస్కరరావు, మాడుగుల నియోజకవర్గం తెలుగు రైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి కడిమి నాగేశ్వరరావు, మాడుగుల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కర్రి నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చింత సాంబమూర్తి, మాజీ మండల అధ్యక్షులు బండారు రామారావు, ఆవుగడ్డ కోటిపల్లి నాయుడు, కిల్లి గోవిందరావు, మొల్లి కృష్ణ, పెద్దడ రమణ, బాబురావు, ఎస్టి సీనియర్ నాయకులు ముసలి పైడ్రాజు, శెట్టి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.