450 కిలోల గంజాయి పట్టివేత

12/20/2024 6:33:51 AM

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 19: గొలుగొండ మండలం  చిన్నయ్యపాలెం గ్రామ శివారు ఫారెస్ట్ ఏరియా వద్ద సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు గొలుగొండ  ఎస్సై రామారావు కృష్ణదేవి పేట ఎస్ఐ వై తారకేశ్వరరావు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్  అశోక్ లేలాండ్ వ్యాన్ ని పరిశీలించగా, గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టగా ఆంధ్ర  ఒడిశా సరిహద్దులో మల్కన్ గిరి జిల్లాకు చెందిన  రాజేష్ శర్మ, కిల్లో మహాదేవ్  నుంచి 450 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నామని రేవతమ్మ తెలిపారు. గొలుగొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన  ఈ కార్యక్రమంలో పాల్గొన్న. డి.ఎస్.పి  మోహన్ మాట్లాడుతూ పట్టుకున్న గంజాయి విలువ 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. గొలుగొండ, కృష్ణ దేవి పేట ఎస్ఐలను ప్రశంసించి. దర్యాప్తు  పూర్తి చేసి నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు,  సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి ఇంకా మిగతా నిందితులను  అరెస్టు చేస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*