కె. కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 19: కోటపాడు మండలం కింతాడ పంచాయతీకి చెందిన కిలపర్తి సన్నిబాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష 16 వేల 158 రూపాయల చెక్కును మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో కే కోటపాడు మండల అధ్యక్షులు రొంగలి మహేష్, కే కోటపాడు క్లస్టర్ ఇన్చార్జి, కింతాడ గ్రామ కమిటీ అధ్యక్షులు కన్నూరు సూర్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు దాడి ఎరుకునాయుడు తదితరులు పాల్గొన్నారు .