అంబేద్కర్ గౌరవానికి భంగం వాటిల్లితే సహించం

12/20/2024 3:48:30 PM


* ఉత్తరాంధ్ర మాల మహానాడు ప్రతిఘటన

కె. కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గౌరానికి భంగం కలిగే విధంగా మాట్లాడితే సహించబోమని ఉత్తరాంధ్ర  జిల్లాల మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల  ఈశ్వరరావు అన్నారు. మొన్న జరిగిన  పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అనడం అందరికీ ప్యాషన్ అయిందని దానికి బదులు దేవుని స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు అనడాన్ని  ఖండిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం వలనే మన దేశం  ఇంత సుభిక్షంగా ఉందన్నారు. ఉన్నతి పదవిలో ఉన్న  అమిత్ షా లాంటి వారు  కేంద్ర మంత్రులు అయ్యారంటే అది రాజ్యాంగం వల్ల దక్కిందన్నారు. ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్  జ్ఞానాన్ని కీర్తిస్తుంటే ఉన్నత పదవిలో ఉన్న నాయకులు ఇలా మాట్లాడడం మంచిది కాదని, ఆ మాటలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్తిపాడు నాగభూషణం, నాయకులు రిట్టపల్లి పెంటయ్య, బొత్స దేముడు, ఎల్లపు  రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*