నేడు దేవరాపల్లికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక

12/20/2024 3:50:45 PM


కె. కోటపాడు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20:  ఎటువంటి  రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవరపల్లి మండలం వస్తున్నారని మండల జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ కొంచ అంజిబాబు తెలిపారు. సరైన వైద్య సదుపాయం లేక గిరిజనలు డోలి మోతలే శరణ్యం అవటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు రూ. 36. 71 కోట్లతో 19 రోడ్లకు 39. 32 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి  మండల జనసేన నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకు దేవరాపల్లి మండలానికి తరలి  రావాలని కోరారు

Name*
Email*
Comment*