గుర్తింపు కార్డులు వినియోగించుకోవాలి

12/21/2024 3:02:20 PM

 * మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ కొండ నాగరాజు..

సోంపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: తీర ప్రాంతాల్లో ప్రతి మత్స్యకారుడు కూడా గుర్తింపు కార్డు(ఎన్.ఎఫ్.డి.పి) వినియోగించుకోవాలని మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ కొండ నాగరాజు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలో 75% ఈ రిజిస్ట్రేషన్ కార్డులు పూర్తి చేశామని, మిగిలిన 25 శాతం ఐడికార్డులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. చిన్న కొత్తూరు గ్రామంలో మత్స్యకారులందరూ శత శాతము గుర్తింపు కార్డులు పొందారన్నారు. అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళవద్దని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు సాగర మిత్ర తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*