మీ సేవలో " సుందరం " * పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ

12/21/2024 3:06:58 PM


కంచిలి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20; కంచిలి మండలం, చొట్రాయిపురం ఎం పీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మడ్డు తిరుపతి రావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. పాఠశాలకు కర్రి సుందరరావు అందించిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని మండల విద్యా శాఖాధికారి సప్పటి శివరామ్ ప్రసాద్  ప్రారంభించారు. పాఠశాల సర్వతో ముఖాభివృద్ధికి సహాయ పడుతున్న పూర్వ విద్యార్థి, ఎస్ఎంసి మాజీ చైర్మన్  కర్రి సుందరరావు రూ . 7500 విలువైన మంచినీటి శుద్ధి యంత్రమే కాకుండా గతంలో విద్యార్థులకు ఐడెంటిటీ కార్డ్స్, టైలను అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా సప్పటి శివరామ్ ప్రసాదు  మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సమాజం భాగస్వామ్యం కలుపుకొని వెళ్ళినప్పుడు, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. దాత కర్రి సుందర రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో చల్ల లింగ మూర్తి మాస్టర్, కర్రి దుర్యోధన, బడ్డీ కామరాజు, గుమ్మడి రామదాసు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*