ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: బహుదా జలాల ఆధారంగా బెల్లుపడ రెవెన్యూ ప్రాంతంలో పంటల సాగు చేస్తున్నారు. ఈ జలాలు సక్రమంగా పంట భూములకు చేరేలా గ్రోయిన్ల అభివృద్ధికి కృషి చేస్తామని బెల్లుపడ ఛానల్ సాగునీటి సంఘ అధ్యక్షుడు కొచ్చర్ల ధనుంజయ రెడ్డి అన్నారు. తెదేపా నాయకులు, అభ్యుదయ రైతు రంగాల జానకిరామ్ రెడ్డి తో కలిసి బహుదా గ్రోయన్ పరిస్థితిని శుక్రవారం పరిశీలించారు. ఏటా గ్రోయిన్ల వద్ద రైతులు శ్రమదానం చేసి, సాగునీటిని కాలువలకు మళ్ళించుకొని సాగు చేస్తున్నారు. ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఈ సందర్భంగా తమ సంఘ సేవలకు సహకారం అందించాలని కోరుతూ తహసీల్దార్ ఎన్ వెంకట్రావు, వ్యవసాయ అధికారి టీ భార్గవిలను మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగాల శ్రీను, లండ రుక్మందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.