తిరుపతి పాలెం రెవెన్యూ సదస్సులో తహసీల్దార్
రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: తిరుపతి పాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ప్రారంభించిన సర్పంచ్ ఆకుల రవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన రీ సర్వేలలో ఏర్పడిన తప్పులమూలంగా ఏర్పడిన ఇబ్బందులను సరి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. జాయింట్ ఎల్ పి ఎం, 1 బి కి ఆధార్ లింక్, రెవెన్యూ సమస్యలు ఎటువంటి ఉన్నా సరే చేస్తారని మండల తహశీల్దార్ తెలిపారు. మండల్ సర్వేయర్ రవి మాట్లాడుతూ ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం మార్గ నిర్దేశాలను అనుసరించి నువ్వు యాజమాన్య హక్కులు చట్టం ప్రకారం లోపాలను సవరించి అర్హులకు న్యాయం చేస్తామని వివరించారు
కార్యక్రమంలో రణస్థలం తహసీల్దార్ ఎన్ .ప్రసాదరావు, మండల సర్వేయర్ రవి, వీఆర్వో వరలక్ష్మి, విలేజ్ సర్వేయర్ ప్రసాద్, గ్రామ పెద్దలు యువత, ప్రజలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.