* సిబ్బందికి ఎస్సీ దిశానిర్దేశం
సోంపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20: మెరైన్ పోలీసులు సముద్ర తీర ప్రాంతాలు, పిక్నిక్ స్పాట్ లు వద్ద అప్రమత్తంగా ఉండాలని, పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉన్న బారువ తీరంపై ప్రత్యేక ధృష్టి సారించాలని విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ రవివర్మ సూచించారు. శుక్రవారం సాయంత్రం బారువ మెరైన్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్ పనితీరుపై ఆరా తీస్తూ స్టేషన్ దస్త్రాలను తనిఖీ చేశారు. గవర్నమెంట్ పరికరాలను పరిశీలించారు. తీర ప్రాంత ముందస్తు సమాచార సేకరణ తీరుపై ఆరా తీశారు. దత్తత గ్రామాల పనితీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీచ్ ప్రమాదాలపై ముఖ్య సూచనలు సలహాలు ఇస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్ కుమార్, ఎస్ఐలు, శిరీష, శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు