పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ శుక్రవారం ఘన స్వాగతం లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామానికి విచ్చేసి గిరిజన గ్రామాలకు (బాగుజోల నుండి సిరివర) రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్భంగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి రూట్ బందోబుస్తూ ఏర్పాట్లును దగ్గరుండి పరిశీలించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రిని జిల్లా ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.