తడిసిన వరి పంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

12/21/2024 4:02:16 PM

ఆనందపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 20 : ఆనందపురం మండలంలో  జగన్నాధపురం, కుసులువాడ, పొడుగుపాలెం, వెల్లంకి గ్రామాల్లో వరి పొలాలని  శుక్రవారం వ్యవసాయ అధికారి కే అప్పలస్వామి  సందర్శించారు. మండలంలో  35 ఎకరాలు వరకు వరి పంట కోత కోసి, పనుల్లో ఉన్నట్టు, తుఫాను కారణంగా సుమారు 200 ఎకరాలు  వరకు రైతులు  వరి పంట కోత కోయకుండ వాయిదా వేసుకున్నట్లు తెలియపరిచారు. నీరు పొలాల్లో నిలిచినట్లైతే వెంటనే గట్లు కొట్టి నీటిని బయటికి పంపేలా తగు చర్యలు తీసుకోమని,  తుఫాను ఉదృత తగ్గగానే  ధాన్యం మొలకెత్తకుండా 2 శాతం ఉప్పు ద్రావణం పనలు తడిచేటట్టు పిచికారీ చెయ్యవలసినదిగా రైతులకు సూచించారు. 2% ఉప్పు ద్రావణం అనగా ఒక లీటర్ నీటిలో 20 గ్రాములు కళ్ళు ఉప్పు (గడ్డ ఉప్పు )ను, అనగా ఒక ట్యాంక్ నీటిలో  250 గ్రాములు ఉప్పు కలిపి పిచికారీ చెయ్యమని సూచించారు. కొన్ని పొలాల్లో చేలు పడిపోయిన సందర్భాలలో, వెంటనే పాయలు తీసి ప్రక్క ప్రక్క ఉన్న దుబ్బులను కలిపి కట్టలుగా కట్టి నిలబెట్టమని రైతులకు  వివిధ సూచనలు అందచేశారు. జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు మండల ఏవో సంధ్యా రత్నప్రభ ఉన్నారు.

Name*
Email*
Comment*