రాజాం. న్యూస్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాజాంలోని సన్రైజ్ హాస్పిటల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, ఎమ్మెల్సీ పాలవలస. విక్రాంత్, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్ తో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ రక్తదానం కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ యలకల వాసునాయుడు తదితరులు రక్తదానం చేసి జగనన్నపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.