చింతపల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబర్ 21: చింతపల్లి మండలం కొండవంచెల గ్రామంలో మంచినీటి బోరును జడ్పిటిసి పోతురాజు బాలయ్య ఎంపీపీ కోరాబు అనూషాదేవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్ నిధుల నుంచి మండలంలో 16 మంచినీటి బోర్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా కొండవంచలో గ్రామంలో మంచి నీటి తీర్చడానికి రెండు లక్షల 70 వేల రూపాయలతో బోర్వెల్ నిర్మించి ఇంటింటికి మంచినీరు సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదేక్రమంలో మండల పరిషత్ నిధుల నుంచి ఇంకో 10 మంచినీటి బోర్లు మంజూరు చేయడం జరిగిందని. దీంతో మండలంలో చాలా గ్రామాలకు మంచినీటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ మంచినీటి బోర్డులు నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లేపల్లి సుభద్రమ్మకు మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.