* మండల ఆదివాసీ గిరిజన సంఘం నేతలు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, డిసెంబరు 21: భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక వేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ ఉభయ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కేత్రీనాథ్ ఎంఎం శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతివాడు అంబేద్కర్ అని మాట్లాడడం ఇది ఒక అలవాటు అయిపోయిందని, ఇలా మాట్లాడితే ఏమి వస్తుందని, దేవుడిని స్మరిస్తే పుణ్యం వస్తుందని అనుచితంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికై, బాధ్యత గల కేంద్ర హోం మంత్రిగా రాజ్యాంగాన్ని రక్షించవలసిన వారే అంబేద్కర్ ని కించపరచడం పార్లమెంటరీ వ్యవస్థని అవమానించడమే అన్నారు. కేంద్ర హోం మంత్రిగా ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని, క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం.నర్సింగ్ పడాల్, ఎస్. గాసిరామ్ దొర, పి.భీమరాజు, ఆదివాసీ మహిళ సంఘం అధ్యక్షురాలు ఎస్.ఈశ్వరి, నాయకులు కె.శంకర్రావు, కె.దొంబ్రు, రాముర్తి పాల్గొన్నారు.