చెత్త కుప్పల తొలగింపు చర్యలు
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 8: అనపర్తి నియోజకవర్గం పెదపూడి పంచాయతీ ఏరియాలో వేట్లపాలెం రోడ్ పక్కన ఉన్న చెత్త కుప్పలను తొలగించే చర్యలు అధికారులు చేపట్టారు. బుధవారం గ్రామ పెద్దల సహకారంతో జెసిపి,ట్రాక్టర్లు ఉపయోగించి గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు ఇవోఆర్డి ఎంఎస్ఎన్ రెడ్డి,కార్యదర్శి ఉషారాణి పర్యవేక్షణలో తొలగించి డంపింగ్ యార్డ్ కి తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా వైజాగ్ ఎక్స్ ప్రెస్ విలేకరితో ఈ ఓ ఆర్ డి ఎం ఎస్ ఎన్ రెడ్డి, కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ పరిశుభ్రత తో "పల్లె పండగ" అనే ఉద్దేశంతో గ్రామాల్లో చెత్త కుప్పలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.