విశాఖలో ప్రధాని రోడ్ షో
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యాటించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు మోదీ హాజరయ్యారు