సాన్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ:

1/10/2025 9:48:22 PM

సాన్ చారిటీ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 10 : శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంవద్ద, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిట్ మేనేజర్, సూరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో, టౌన్ సిఐ గోవిందరావు శుక్రవారం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతూ, శీతాకాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సామాజిక స్పృహతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సాన్ చారిటీ సంస్థ ప్రతినిధి అప్పలనాయుడును, సీఐ గోవిందరావు కోరారు. ఈ సందర్భంగా యూనిట్ మేనేజర్ అప్పలనాయుడు మాట్లాడుతూ, తిరుపతికి చెందిన చారిటీ సొసైటీ సహకారంతో,శాన్ చారిటీ సంస్థ ద్వారా దుప్పట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనేక గిరిజన గ్రామాలలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతినిత్యం నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమంలో సాన్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*