పండగ పూట తస్మాత్ జాగ్రత్త

1/10/2025 9:50:43 PM

పండగ పూట తస్మాత్ జాగ్రత్త

కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 10

కంచిలి మండలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పారినాయుడు ఆదేశాల మేరకు మండలంలో గల అన్ని గ్రామాలలో ఆటోలో మైక్ సౌండ్ ద్వారా దండోర వేయించడం జరిగింది. పండగ కు పాఠశాలలు కార్యాలయాలు సెలవు దినాలు కావడంతో తమ సొంత గ్రామాలకు వెళ్లే వారు తమ యొక్క ఇళ్లకు తాళాలు వేసి తమ యొక్క విలువైన బంగారు ఆభరణాలు వస్తువులను లాకర్లలో గాని తమతోపాటు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో తమ ఇళ్లలో ఉంచరాదని మైకు ప్రచారాలు ద్వారా మండల ప్రజలకు అప్రమత్తం చేశారు. దీన్ని మండల ప్రజలు అమలుపరచి సంక్రాంతి కనుమ పండుగలను  ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

Name*
Email*
Comment*