మందస ఎస్సైగా క్రిష్ణప్రసాద్

1/10/2025 9:51:38 PM

మందస ఎస్సైగా క్రిష్ణప్రసాద్


 మందస ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ జనవరి 10 :

మందస ఎస్సైగా కె.క్రిష్ణప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం క్రైం పోలీసు స్టేషన్ నుంచి బదిలీపై ఆయన మందసకు వచ్చారు. గతంలో పని చేసిన ఎస్ఐ ఎస్.కె. ఖాదర్బాషా సస్పెండ్ కావడంతో సుమారు రెండు నెలలుగా ఈ స్థానం ఖాళీగా ఉంది.  రెగ్యులర్ ఎస్ఐగా క్రిష్ణప్రసాద్ ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రిష్ణప్రసాద్ మాట్లాడుతూ శాంతి, భద్రతలకు ప్రజల సహకారం కావాలన్నారు. నేరరహిత మందసగా తీర్చిదిద్దుతామన్నారు. పోలీసు స్టేషన్ సిబ్బంది ఆయన స్వాగతం పలికి, అభినందించారు.

Name*
Email*
Comment*