పట్టణంలో మునిసిపల్ కమీషనర్ పర్యటన
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 :
బాపట్ల పట్టణ పరిధిలో శుక్రవారం తెల్లవారుజాము నుండే మునిసిపల్ కమీషనర్ జీ. రఘునాథరెడ్డి సిబ్బందితో కలిసి పర్యటించారు.ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవస్థానం వద్ద పారీశుద్ధ్యన్ని పరిశీలించి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.అనంతరం రైతు బజార్ ను పరిశీలించారు.పట్టణంలోని దేవునిమాన్యం వద్ద నూతనంగా గృహాలు నిర్మించుకున్న యజమానులు తాగునీటి సరఫరా జరగడంలేదని కమీషనర్ దృష్టికి తీసుకువచ్చారు.మంచినీటి పైపు లైన్ ఇంటర్ కనెక్షన్ చేసి త్వరలోనే నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.తదుపరి సూర్యలంక రోడ్డు లోని అన్న క్యాంటిన్ ను పరిశీలించి ప్రజలను ఆహార నాణ్యత,శుభ్రత, తాగునీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అన్న క్యాంటిన్ సిబ్బందితో మాట్లాడుతూ క్యాంటిన్ పరిసరాలు శుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, త్రాగునీటి విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.అనంతరం జమ్ములపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ప్రధాన డ్రైనేజీ నీరు పారుదల చాలా రోజుల నుండి సక్రమంగా లేని కారణంగా పారీశుధ్య విభాగ అధికారులతో మాట్లాడి వెంటనే దగ్గరుండి పారీశుధ్య సిబ్బందిని పిలిపించి డ్రైనేజీ పూడికతీత పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.మునిసిపల్ కమీషనర్ వెంట అసిస్టెంట్ ఇంజనీర్ జీ.ప్రసాద్,రెవిన్యూ అధికారి అబ్దుల్ జబ్బార్,శానిటరీ ఇన్స్పెక్టర్ డీ.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.