వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సహాయం అందజేత
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 :
అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైధ్యం చేయించుకోవడానికి ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న బాపట్ల పట్టణం ఇస్లాంపేటకు చెందిన పాల్వయి డేవిడ్ కు ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ సందర్బంగా ఆర్గనైజేషన్ అధ్యక్షులు బండ్రేడ్డి గోపి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తమ ఆర్గనైజేషన్ సభ్యుల సహకారంతో ఆర్ధిక సహాయం అందజేస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు,ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల సురేష్,కోశాధికారి జోగి సువర్ణరాజు,సభ్యులు మద్దిబోయిన గోపి, యాసం రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు