చరణ్, మణికంఠ మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

1/10/2025 10:08:57 PM

చరణ్, మణికంఠ మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 : ఇటీవల తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురై చరణ్, మణికంఠ మృతి చెందిన ప్రాంతాన్ని  ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ మధురపూడి విమానాశ్రయం నుంచి రాజానగరం మీదుగా కాకినాడ జిల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద చరణ్, మణికంఠ ప్రమాదానికి గురై మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పటేల్, ఇతర అధికారులను డిప్యూటీ సీఎం  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎడిబి రహదారి పనులను పరిశీలించి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం రహదారి మార్గం పనులు చేపట్టడం వలన కలిగే ఇబ్బందులపై  పవన్ ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు అధికారులు 

Name*
Email*
Comment*