పైడా కాలేజీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గంట

1/10/2025 10:10:01 PM

పైడా కాలేజీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గంట

 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, జనవరి 10.

 ఆనందపురం మండలంలో గల బోయిపాలెం గ్రామపంచాయతీలో గల పైడా కాలేజ్ నందు శ్రీ వెంకటేశ్వర ఆలయం ముక్కోటి ఏకాదశి కారణంగా స్వామిని దర్శించుకోవడానికి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు రావడం జరిగింది, శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు లో పాల్గొన్న గంట శ్రీనివాసరావు , ఆలయానికి భక్తులు రద్దీ అవటంతో ఆలయ ధర్మకర్త పైడా కృష్ణ ప్రసాద్ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి క్యూ పద్ధతిని పాటించాలని భక్తులకు హెచ్చరించడం జరిగింది, అనంతరం భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ  రెండు రోజుల క్రితం తిరుపతి దేవస్థానం వద్ద అతి ఘోరమైన ఘటన జరగటంతో ఆరుగురు మరణించి 30 మంది గాయలు అవడం జరిగింది అలా కాకుండా స్వామి వారిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఒక పార్కులో ఏర్పాటు చేసిన భక్తులు క్యూ పద్ధతిని పాటించి వెళ్ళమని చెప్పిన అక్కడ తోపులాట జరగటంలో ఈ ఘటన జరిగిందని మీడియా ముఖముగా చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే తప్పు ఉందో వారి కి కఠినమైన చర్య తీసుకో పడుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వారిపై కఠిన చర్య తీసుకుంటామని ఇటువంటి సంఘటన ఇంకా ఎప్పుడు జరగనివ్వమని అలాగే టిటిడి చైర్మన్ కూడా ఉత్తరంలో జారీ చేయటం కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నది, ఇలాంటి సంఘటన ఎన్నడూ కూడా జరగలేదని, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు బాధాకర విషయం అని అంటున్నారు.

Name*
Email*
Comment*