సంక్రాంతికి పండుగకు ఊరు వెళ్లేవారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరండి
బాపట్ల డీ ఎస్ పీ రామాంజనేయులు
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 :
బాపట్ల జిల్లా ఎస్ పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల డీ ఎస్ పీ రామాంజనేయులు సంక్రాంతి పండుగ నిమిత్తం ఊరికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని డీ ఎస్ పీ రామాంజనేయులు సూచించారు.ద్విచక్ర వాహనంపై కుటుంబంతో వెళ్ళారాదన్నారు.ద్విచక్ర వాహనం నడిపేతప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.అతివేగంతో వెళ్ళరాదని తెలిపారు.మంచుపడే సమయంలో ప్రయాణం చేయరాదన్నారు.కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు.సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపారదన్నారు.మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు.ద్విచక్ర వాహనంపై ఇద్దరికీ మించి ప్రయాణం చేయరాదన్నారు.