ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా

1/10/2025 10:12:41 PM

ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా
మధురవాడ-- మధురవాడ మరో మాదాపూర్ గచ్చిబౌలిల విస్తరిస్తుందని రాబోయే ఐదేళ్లలో మరింత మధురవాడ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం 7వ వార్డులో అవార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, వెంకట్రావు అధ్యక్షతన, వార్డు  అధ్యక్షుడు పిల్లా నరసింహారావు ఆధ్వర్యంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలకు గంటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ జీవీఎంసీ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు  నాలుగు కోట్ల 58 లక్షల శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకే చెల్లితోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దించేసి ప్రజలను మోసం చేశారన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు ఊపిరి అందించి ప్రగతి పథంలో నడుపుతున్నారని పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే భీమిలి నియోజక వర్గం లో తనను 90 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిపించి నభీమిలి ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని, అంతకు ముందు కూడా 30 వేల ఓట్లు మెజార్టీతో గెలిపించి రాష్ట్ర చరిత్రలోనే భీమిలిలో నన్ను అంత భారీ మెజార్టీతో గెలిపించడం నా అదృష్టమని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  జోన్ టు కమిషనర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ వాండ్రాసి అప్పలరాజు, కానూరు అచ్యుతరావు, మొల్లి లక్ష్మణరావు, జనసేన 8వ వార్డ్ అధ్యక్షుడు సేకరి శ్రీను, 7వ వార్డు జనసేన అధ్యక్షుడు నాగోవతి నరసింహనాయుడు, టిడిపి నేత టేకు పూడి నర్సింగరావు, జనసేన , పేకేటి శ్రీను, ఈ సందర్భంగా 5వ వార్డు టిడిపి అధ్యక్షుడు నాగోతి సత్యనారాయణ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు ఇచ్చారు.

Name*
Email*
Comment*