తిరుప‌తి ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు రూ.25 లక్షల నగదు

1/10/2025 10:30:57 PM

తిరుప‌తి ఘ‌ట‌న‌లో మృతుల కుటుంబాల‌కు 
రూ.25 లక్షల నగదు 

- కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- టీటీడీ పాల‌క‌వ‌ర్గం తీర్మానం
- వెల్ల‌డించిన టీటీడీ అధ్య‌క్షుడు బీఆర్ నాయుడు

తిరుప‌తి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌;  తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నగదు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వ‌డానికి  
 టీటీడీ తీర్మానించిందని టీటీడీ అధ్య‌క్షుడు బీఆర్‌ నాయుడు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం, స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే చెక్కులు సిద్ధం చేశామని చెప్పారు. రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తామని పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారని నాయుడు తెలిపారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేస్తున్నామని,  కావాలనే చేశారా అనే అంశంపై విచారణ చేయిస్తామని చెప్పారు. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Name*
Email*
Comment*