రెవెన్యూ సదస్సుల అర్జీలు సత్వరం పరిష్కరించాలి

1/10/2025 10:35:28 PM

రెవెన్యూ సదస్సుల అర్జీలు సత్వరం పరిష్కరించాలి

*జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10: రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. "అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం టెక్కలి ఆర్.డి.ఓ కార్యాలయంలొ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి పలాస, టెక్కలి రెవిన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, సంబంధిత అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేసి, రైతుల సమస్యలను తొందరగా పరిష్కరించాలి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలొ జిల్లా జాయింట్ కలెక్టర్, ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర రావు, టెక్కలి, పలాస రెవెన్యూ అధికారులు కృష్ణ మూర్తి, వెంకటేష్, కె. ఆర్.సి. డిప్యూటీ కలెక్టర్లు బి.పద్మావతి, లావణ్య, ఆయా మండలాల ఉప తహసిల్దార్లు,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లులు, వి ఆర్ ఓ లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*