బొంతుపేట లో ఉత్సాహంగా ముగ్గులు పోటీలు . రణస్థలం - వైజాగ్ ఎక్స్ ప్రే స్, జనవరి, 14: లావేరు మండలం పరిధిలో బొంతుపేట గ్రామంలో ముగ్గులు పోటీ ఉత్సాహం గా జరిగింది.సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు, బాలికలకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొంతు విజయకృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొంతుపేట గ్రామ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఈ ముగ్గుల పోటీ న్యాయ నిర్ణీతగా బెజ్జిపురం మాజీ పంచాయితీ ప్రెసిడెంట్ ఇజ్జాడ ఉత్తర, ఇజ్జాడ కుమారిలు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో గృహిణిల విభాగంలో మూడు బహుమతులు బాలికల విభాగంలో మూడు బహుమతులు అదే విధంగా లక్కీ డ్రా తీయడం జరిగింది విజేతలకు బహుమతులను విజయనగరం జిల్లా భారతీయ జన సేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు,ఉత్తర లక్ష్మి,బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంతుపేట టిడిపి సీనియర్ నాయుకులు బొంతు వెంకటరమణ మూర్తి. గ్రామ పెద్దలు ఇజ్జాడరామారావు లోలుగు ధర్మారావు, బొంతు జగ్గు నాయుడు,బొంతు మహాలక్ష్మి నాయుడు, వాళ్ళే జగదీశ్,కెల్లా రమణ, అడపా సత్యం, బొంతు కాశీనాయుడు, జనసేన యువత సేన బొంతు జగన్నాథ నాయుడు,బొంతు రామకృష్ణ,అడపా ప్రసాదు సువ్వాడ ప్రసాద్, అడపా అన్నంనాయుడు, వైశ్యరాజు శేఖర్,గొలగాన శ్రీను తదితరులు పాల్గొన్నారు