వితంతు మహిళలకు చీరల పంపిణీ

1/14/2025 6:25:45 PM

వితంతు మహిళలకు చీరల పంపిణీ

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,14: మండలంలో ఏనుగురాయి పంచాయతీ మజ్జిగుడ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జామిగూడ పంచాయితీ మాజీ ఎంపీటీసీ మజ్జి చంద్రబాబు మంగళవారం మజ్జిగూడ గ్రామ వితంతు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ దినమున ప్రతి ఏడాది గ్రామంలో పేద, వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ ఏడాది కూడా గ్రామంలో వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశామని పండుగ పూట ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం మనసుకు సంతోషకరంగా ఉంటుందని మాజీ ఎంపీటీసీ చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ ఇన్చార్జి మజ్జి చిన్నిబాబు తో పాటు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Name*
Email*
Comment*