రోగులకు సకాలంలో భోజనాలు అందించాలి

1/14/2025 6:27:49 PM

రోగులకు సకాలంలో భోజనాలు అందించాలి

జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ కె కృష్ణారావు

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,11: సామాజిక ఆరోగ్య కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి వైద్య సేవలు పొందుతున్న రోగులకు సమయానికి భోజనాలు పెట్టాలని తీరు మారకపోతే నిర్వహణ బాధ్యత నుండి తొలగిస్తామని పాడేరు జిల్లా ఆసుపత్రి సూపర్ ఇండెంట్ కే కృష్ణారావు అన్నారు. శనివారం అయన మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్యకేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న రోగులకు మెనూ ప్రకారం సమయపాలన పాటించకుండా భోజనాలు పెట్టుచున్నారని రోగుల ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఆరోగ్య కేంద్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి వైద్య సేవలు పొందుతున్న రోగులకుమెనూ ప్రకారం బోధనాలు పెట్టాలని సమయపాలన పాటించి అల్పాహారము భోజనలు పెట్టాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకురోగులకు బోజానాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకుసోకాజ్ నోటిష్ ఇచ్చారు. అలాగే తీరు మారకపోతేపిర్యాదులు మరలా వస్తే నిర్వహణ బాజాల నుండి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి సంతోష్వైద్య సిబ్బంది రమేష్ సురేష్ గ్రీష్మ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*