నేటి నుంచి భద్రమాంకాళి అమ్మవారి జాతర.
రణస్థలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 14
రణస్థలం మండలంలో కోటపాలం పెద్ద చేరి వద్ద కొలువైన శ్రీ భద్రమాంకాళి అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజులు పాటు జరిగే జాతర మహోత్సవాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు