దేవరాపల్లి లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్

1/14/2025 6:33:35 PM

దేవరాపల్లి లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్
దేవరాపల్లి, వైజాగ్ ఎక్స ప్రెస్, జనవరి 14:
సంక్రాంతి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నా తరుణంలో అనకాపల్లి జిల్లా లో సంక్రాంతి సంబరాలు లో భాగంగా ఈ ముఖ్యమైన పెద్ద పండుగను కుటుంబ సభ్యులతో కలిసి దేవరపల్లిలో మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరిగిన పల్లె పండుగ వేడుకల్లో ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్  మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తో కలసి పాల్గొన్నారు.మండల కేంద్రానికి విచ్చేసిన సీఎం రమేష్  వారి కుటుంబ సభ్యులకు ప్రజలు తండోపతండాలుగా హాజరై  ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సీ.ఎం రమేష్  మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతి ఒక్కరు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాలను గడిపేలా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు.మన సంస్కృతి సంప్రదాయాల్లో అత్యున్నతమైన ముఖ్యమైన పండుగను అనకాపల్లి జిల్లా ప్రజలతో కలిసి నిర్వహించుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు అందుకుగాను కుటుంబ సభ్యులు మొత్తం అనకాపల్లి జిల్లాకు తరలి వచ్చినట్లు పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నమని ఈ ముఖ్యమైన పర్వదినాన్ని దేవరపల్లి లో ప్రజలతో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*