పదవులు రారాజు పాలవలస రాజశేఖరం మృతి

1/14/2025 6:34:46 PM

పదవులు రారాజు  పాలవలస  రాజశేఖరం మృతి 
పండగ పూట విషాదం 
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 14
పాలకొండ డివిజన్ లో పదవులు రారాజు గా పేరు పొందిన మాజీ రాజ్య సభ సభ్యులు పాలవలస. రాజశేఖరం సోమవారం రాత్రి మృతి చెందటం తో పాలకొండ పట్టణం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.అలాగే ఈ వార్త విన్న అభిమానులుతో పాటు వైసీపీ శ్రేణులు ల్లో ఒక్కసారి గా విషాదం నెలకొంది. కాగా పాలకొండ పట్టణం,సమీప ప్రాంత ప్రజానీకం అతనికి  పెద్దరాజు అని గౌరవంగా పిలుచుకుంటారు.ఇంత 
పేరు ఉన్న పాలవలస రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు.బిఎస్సి డిగ్రీ పూర్తి చేసుకొని రాజకీయ క్షేత్రంలో అడుగులు వేస్తున్న   యవ్వన దశలోనే జిల్లా పరిషత్ చైర్మన్ పదివి వరించింది.తదుపరి  రాజ్యసభ సభ్యుడుగా డిసిసిబి చైర్మన్గా పదవులు అలరించారు.
 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఉనుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఎన్టీరామారావు ప్రభంజనంలో ఉత్తరాంధ్ర జిల్లాలో కాంగ్రెస్ కకావికలo అయ్యింది.మొత్తం 37 తనలో 36 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.ఆ సునామీలో ఎన్టీఆర్ అనే కెరటానికి ఎదురొడ్డి నిలిచిన ఏకైక నేత పాలవలస రాజశేఖరo.ఆ ఎన్నికల్లో పాలవలస రాజశేఖరo ఒక్కరే కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు.

1999 లో ఓటమి చెందినప్పటికీ,2004 లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ..పాలవలస రాజశేఖరం,జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా మలిచేలా చేసింది.మరో సారి  జిల్లా పరిషత్ చైర్మన్ గా మరో మారు ఆశీనులయ్యారు.తరువాత వయసు రీత్యా జిల్లా రాజకీయాల వైపే మొగ్గు చూపారు.ఆరోగ్య సహకరించకపోవటం వంటి కారణంగా క్రియాశీలక రాజకీయాలకు రాజశేఖరం దూరంగా ఉన్నారు.
ఇతని తల్లి పాలవలస రుక్మిణమ్మ ఎమ్మెల్యే గా పని చేశారు,. కూమార్తె రెడ్డి శాంతి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే,కుమారుడు విక్రాంత్  ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రాజశేఖరం సతీమణి ప్రస్తుతం రేగిడి ఆముదాలవలస జడ్పిటిసిగా ఉన్నారు.ఇలా మూడు తరాల్లోనూ,ఒకే కుటుంబానికి చెందిన వారు సుధీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగటం అరుదైన విషయం.మూడు తరాలకు చెందిన దిగ్గజ రాజకీయ నేతలతో, తలపడిన,.. తలపండిన సీనియర్ పొలిటీషియన్ గా రాజశేఖరంను  చెప్పవచ్చు.కాంగ్రెస్ రాజకీయాల్లో, అనంతరం వైసిపి రాజకీయాల్లో పాలకొండ డివిజన్లో కీలక నాయకుడు అయ్యారు.రాజకీయాల్లో గెలుపు, ఓటముల సహజం. అధికారంలో ఉన్నా లేకపోయినా..పదవుల్లో ఉన్నా లేకపోయినా నిజాయితీ గల రాజకీయాలను నెరపటంలో దిట్టగా ప్రజల మధిలో నిలిచారు పాలవలస.రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా ప్రజల మనసులు గెలిచిన ఒక రాజకీయ దిగ్గజం పాలవలస శాశ్వతంగా అందరిని వదిలి వెళ్ళారనే వార్త కాస్తoత అభిమానులు లోను వైసీపీ శ్రేణులు విషాదం నింపడం తో భోగి రోజు మృతి చెందటం కుటుంబ సభ్యులు లోను అత్యంత విషాదం నెలకొంది

Name*
Email*
Comment*