తెర్లాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: ఏప్రిల్ 05
వాన్, బైక్ ఢీ కొని ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయారని సబ్ ఇన్ స్పెక్టర్ సురేంద్ర నాయుడు తెలిపారు. స్థానిక వెంకటేశ్వర కాలేజ్ దగ్గర మంగళవారం ఆక్సిడెంట్ జరిగిండి. స్థానికులు, పోలీసులు చెప్పిన కధనం ప్రకారం ఏపి 23 వై 7444 వాన్, ఏపి 35 ఏజె 7271 బైక్ ని ఢీ కొట్టింది. వాన్ డ్రైవర్ అజాగ్రత్తగా, స్పీడ్ గా నడపడం వలన జరిగిందన్నారు. గుగ్గిలాపు గణపతిరావు, గోపాలరాయుడు పేట అని గుర్తించారు. తలకి బలమైన దెబ్బ తగిలిందని వెంటనే చనిపోయారు. ఎస్.ఐ సురేంద్ర నాయుడు కేస్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.