సిమెంట్ రోడ్డు పనులలో నాణ్యత పాటించాలి
కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 8:
మండలంలో గల జాడపూడి పంచాయతీ బసవ పుట్టుక గ్రామంలో నిర్మించి తలపెట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఎంజిఎన్ఆర్ జిఎస్ నిధులు సుమారు 5.40 లక్షలతో నిర్మితమవుతున్న సిసి రోడ్డుకు జరుగుతున్న పనులను పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి వి తిరుమలరావు. బసవపుట్టు గ్రామంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు కు సంబంధించి నాణ్యత కొలతలు సక్రమంగా ఉండాలని , నాణ్యత పాటించాలని గుత్తేదారుకు తగు సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డు పరిశీలన చేపట్టడం జరిగింది. నాణ్యత ప్రమాణాలలో డొల్లతనం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.