సంక్రాంతి కి విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు


.............
సంక్రాంతికి విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు


అమరావతి, వైజాగ్ ఎక్స్‌ఫ్రెస్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే ప్రత్యేక రైలు నంబరు 08511 జనవరి 10,12,17,19 తేదీల్లో విశాఖపట్నంలో సాయంత్రం 5.30కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.15 నిమిషాలకు చేరుకుంటుందని వివరించారు. ఇదే రైలు 11, 13, 18, 20 తేదీల్లో చర్లపల్లిలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకకు విశాఖపట్నంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. రైలు నంబరు 07416 అనకాపల్లి నుంచి వికారాబాద్‌ ప్రత్యేక రైలు జనవరి 18 రాత్రి 9.45 గంటలకు అనకాపల్లి నుంచి బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.

Leave a Comment