పలాసలో విజయోత్సవ సంబరాలు
డిల్లీలో బిజెపి గెలిచిందని !
శ్రీకాకుళం ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 8:
దేశ రాజధాని ఢిల్లీని శనివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో 48 స్థానాలతో విజయం సాధించినసందర్భంగా పలాస నియోజకవర్గ కన్వీనర్ శ్రీ రామానంద స్వామి అధ్యక్షతన శనివారం సాయంత్రం ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశమంతటా కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి పై నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజు మోహనరాజు బిజెపి నాయకులు, కోర్రాయి బాలకృష్ణ, తమ్మి నాన మాధవరావు, కొత్తకోట జనార్ధన రావు, బూర్జిపేట హరికృష్ణ, గుంట అప్పారావు, బోండా శ్రీనివాసరావు, బేవర షణ్ముఖరావు, హనుమంతు రామారావు, లవకుశ తదితరులు పాల్గొన్నారు.